సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. 1989లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఓంప్రకాశ్ సూపర్ హిట్, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా వివిధ హోదాలలో పనిచేశారు.