సూర్య గారు చెప్పింది ఎప్ప‌టికీ మ‌రచిపోలేను - వంశీ పైడిప‌ల్లి

శనివారం, 1 జూన్ 2019 (22:04 IST)
'మహర్షి' నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్‌‌బస్టర్‌తో పాటు మహేష్‌బాబు కెరీర్‌లోనే ల్యాండ్‌ మార్క్‌ మూవీగా నిలిచింది. ఏ నమ్మకంతో అయితే సినిమా స్టార్ట్‌ చేశామో ఈ రోజు ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా విజయంతో పాటు మాకిచ్చిన రెస్పెక్ట్‌ మా జీవితాంతం గుర్తుండిపోతుంది అని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెలియ‌చేసారు. మ‌హ‌ర్షి చిత్రం 100 కోట్ల షేర్ క్రాస్ చేసి..నేటికీ స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
ఈ సంద‌ర్భంగా వంశీ స్పందిస్తూ... ఎక్కడికెళ్ళినా రైతులు తమ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాకు ఒక గుర్తింపునిచ్చారన్నా అంటున్నారు. మాకెలా స్పందించాలో తెలియలేదు. ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. రైతులను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. సొసైటీలో ఇది ఇంత ఇంపాక్ట్‌నిచ్చి అంతమందిని ఇన్‌స్పైర్‌ చేసే సినిమా అయినందుకు మా టీమ్‌ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక మా టీమ్‌ కృషి ఎంతో ఉంది. నాలుగో వారంలోకి వచ్చినా కూడా ఈ సినిమా గురించి మాకు ఫోన్లు వస్తున్నాయి. 
 
ఈ సినిమాను అభినందించిన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఇండస్ట్రీ ప్రముఖులకు మా టీమ్‌ అందరి తరపున ధన్యవాదాలు.  కొన్ని కొన్ని సినిమాలు మన జీవితాల్లో తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమానే 'మహర్షి'. ఈ సినిమాకి ఇంతటి కలెక్షన్స్‌ ఇచ్చి, అంతకంటే మంచి రెస్పెక్ట్‌ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ రెస్పెక్ట్‌ని మా నెక్స్‌ట్‌ మూవీకి కాపాడుకుంటాం. అలాగే ఈ సినిమా చూసి సూర్య గారు ఒక మెమొరబుల్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. నన్ను అడ్మైర్‌ చేసిన యాక్టర్స్‌లో ఒకరు. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు.
 
'వంశీ.. ఒక 20, 25 ఇయర్స్‌ వరకు మనం ఒక సొసైటీ నేర్పిందో లేదా ఒక స్కూల్‌ నేర్పిందో, పేరెంట్స్‌ నేర్పిందో పట్టుకొని వెళ్తుంటాం. కానీ మీ సినిమా ద్వారా 20, 25 సంవత్సరాల్లో నేర్చుకోని ఒక థాట్‌ను ప్రొవోక్‌ చేశారు. మీరు రాసిన కథ, మహేష్ గారు చూపించిన గట్స్‌, సోషల్‌ మెసేజ్‌ అమేజింగ్‌' అన్నారు. 175 రోజులు మహేష్ గారితో ట్రావెల్‌ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రిలీజయ్యాక 21 రోజులు ఆయనతో ఇంకా అన్యూన్యంగా గడిపే సమయం లభించింది. ఫస్ట్‌ నుండి మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. మాకు, ప్రేక్షకులకు మీరే వారథి. హాలిడే ట్రిప్‌కి యూరప్‌ వెళుతున్నాను. వచ్చాక మా నెక్స్‌ట్‌ సినిమా వివరాలు తెలియజేస్తాం'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు