సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. తమిళంలో శింబు సరసన పోడాపోడీ సినిమాలో తెరంగేట్రం చేసిన వరలక్ష్మి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా వరమ్మ మ్యూజికల్ డ్రామాలో కనిపించనుంది. సినిమా షూటింగ్‌ల్లో సీన్ తప్పైతే మళ్లీ మరో టేక్ చేసుకోవచ్చునని.. కానీ ఇలాంటి డ్రామాల్లో రెండో టేక్ పోలేమని వరలక్ష్మి చెప్పింది.
జెఫ్రీ వరదన్ దర్శకత్వంలో ఈ మ్యూజికల్ డ్రా జూలై 8, 9 తేదీల్లో చెన్నైలో జరుగనుంది. పాపులర్ షేక్‌స్పియర్ రోమియో జూలియట్‌గా మ్యూజికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 10 సాంగ్స్ వుంటాయి. ఈ షోకు మంచి ఆదరణ లభిస్తే పలు ప్రాంతాల్లో ఇలాంటి మ్యూజికల్ డ్రామాలు చేసేందుకు వరలక్ష్మి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.