"అబ్జెక్టిఫైయింగ్ డైలాగ్‌లు, కస్ వర్డ్స్, క్లీవేజ, పెల్విస్‌కి సంబంధించిన క్లోజప్ షాట్‌లను" తొలగించాలని CBFC మేకర్స్‌ని కోరినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే.. రీసెంట్ గా తన నుంచి వస్తున్న సినిమాల్లో ఫలితానికి దీనికి పెద్ద తేడా లేదని చెప్పాలి. సేమ్ అదే ఫార్ములా ట్రీట్మెంట్ రొటీన్ కథా కథనాలతో తాను సినిమాని నడిపించేసాడు. యాక్షన్ బ్లాక్ లు ఎక్కడో కొన్ని ఎమోషన్స్ తప్ప ఇక సినిమాలో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రంగీలా టైంకు ఇప్పటికి యూత్‌లోనూ చాలా మార్పులు రావడంతో ఇలాంటి స్కిన్‌షోను ఆదరిస్తారోలేదో చూడాల్సిందే.