ఇక గణేష్ తో లవ్ గురించి మాట్లాడుతూ, ఎలా ఇటువంటి వార్తలు పుట్టుకొస్తాయో తెలీదు. నేను తను ఫ్రెండ్లీగా వుంటాము. ఛాటింగ్ కూడా అదే తరహాలో చేసుకున్నాం. నటనాపరంగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడు చెబుతున్నా. చనువుగా వుంటే ఎపైర్ వున్నట్లు కాదు. దయచేసి గ్రహించండి అని తెలిపింది.
ఇక తమిళ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతూ, తనతో బికిల్ సినిమా చేశాను. చాలామంది మంచి పర్సన్. ప్రజలకు సేవ చేయాలనే ద్రుక్పథం కనిపించేది. అలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే సేవ చేయగలరు అని కితాబిచ్చింది.