నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ 'మట్కా' 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ సోఫాలో కూర్చుని ఒక చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్ తో కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. 'వైలెన్స్ విత్ విజన్' అనే క్యాప్షన్ తో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ వింటేజ్ అవతార్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మట్కా వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు