"ఫియర్" ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంది. సింధు పాత్రలో వేదిక అద్భుతమైన పర్ ఫార్మెన్స్ చేసింది. సింధును బాల్యం నుంచి వెంటాడుతున్న బూచోడు ఎవరు, ఆమెను ఎందుకు భయపెడుతున్నాడు అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చివరలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ చేసింది. అనూప్ రూబెన్స్ అందించిన బీజీఎం, ఐ ఆండ్రూ విజువల్స్ టాప్ క్వాలిటీతో ఉన్నాయి. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూడబోతున్న ఫీలింగ్ "ఫియర్" ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు - వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు