'ఆడాళ్లూ మీకు జోహార్లు' ఆగిపోయిందా!

గురువారం, 29 డిశెంబరు 2016 (20:37 IST)
వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్ల పబ్లిసిటీ కావడంతో చేసేదిలేకపోయింది. 
 
ప్రస్తుతం కిషోర్‌ తిరుమల మరో చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అది కూడా రామ్‌తోనే. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'నేను శైలజ' వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి