విక్టరీ వెంకటేష్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పలు విషయాలు తెలియజేశారు.
-ధమాక, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్ .. ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. అనిల్ గారికి సాహిత్యం, సంగీతంపై వున్న అభిరుచి దీనికి కారణం.
వెంకటేష్ గారిని నేరుగా చూసింది కూడా లేదు. అలాంటిది ఆయన సినిమాకి వర్క్ చేస్తున్నానని తెలియగానే చిన్నప్పటి నుంచి చూసిన ఆయన సినిమాలు, పోస్టర్లు కళ్ళముందు రీల్స్ లా తిరిగాయి. అయితే అనిల్ గారు నా వర్క్ ని ఈజీ చేశారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా చెప్పారు. వర్క్ చాలా ఫాస్ట్ గా చేశాం. అనిల్ గారి గారు ఇచ్చిన ఫీడ్ కారణంగానే ఆల్బమ్ ఇంత అద్భుతంగా వచ్చింది.
-వెంకటేష్ గారి సినిమాకి పని చేయడం దేవుని దయగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ స్వయంగా వెంకటేష్ గారు ఆయనంతట ఆయనే వచ్చి పాడటం కూడా దేవుని దయగా భావిస్తున్నాను. అదో కలలా అనిపించింది. సంగీత దర్శకుడిగా ఇది నాకో ఎచీవ్మెంట్. వెంకటేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు సంక్రాంతికి వస్తున్నాం.
ఈ సినిమా తర్వాత మ్యాడ్ 2, మాస్ జాతర, టైసన్ నాయుడు, డకాయిట్ సినిమాలు చేస్తున్నాను.