Venkatesh, Aishwarya Rajesh
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా అలరించిన రొమాంటిక్ ట్రాక్ సంక్రాంతికి వస్తున్నాంలో ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్ అయింది. భాస్కరభట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదాలని అందంగా ప్రజెంట్ చేసింది. వారు షేర్ చేసుకునే ఆప్యాయత, ప్రేమను ప్రదర్శిస్తూనే, ఒక బాండింగ్ లో హ్యుమరస్ ఆర్గ్యుమెంట్స్ ని హైలైట్ చేస్తుంది. ఈ పాట జానపదం టచ్ ని కలిగి ఉంది, భీమ్స్ సిసిరోలియో అద్భుతంగా కంపోజ్ చేశారు. రమణ గోగుల యూనిక్ స్టయిల్ మెలోడీకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. మధు ప్రియ మెస్మరైజ్ చేసే వాయిస్ పాట ఆకర్షణను మరింత పెంచింది.