తొలిసినిమా జనతా గ్యారేజ్ సినిమాలో నటించి తరువాత భాగమతి, ఖిలాడి చిత్రాల్లో పరిచయం అయిన ఉన్ని ముకుందన్ తాజాగా మార్కో సినిమాలో నటించారు. మలయాళంలో రూపొందిన ఈ సినిమా జనవరి 1న తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో తొలి రోజు హయ్యస్ట్ వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచింది. ఈ సందర్భంగా హీరో ఉన్ని ముకుందన్ మార్కో విశేషాల్ని పంచుకున్నారు.