సీనియర్ నటుడు వీరభద్రం కన్నుమూత

డీవీ

శుక్రవారం, 29 మార్చి 2024 (15:48 IST)
Veerbhadra passes away
గత కొంతకాలంగా అస్వస్థతకు గురయి బెడ్ మీదనే వున్న సినిమా, టీవీ, రంగస్తల నటుడు వీరభద్రం నేడు మరణించారు. మధిరలో ఈరోజు ఉదయం మరణించారని ఆయన కుమారుడు తెలియజేశారు. గత సెప్టెంబర్ లో హైదరాబాద్ లో వుంటున్న వీరభద్రం ఆయన ఇంటిలోనే జారిపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయారు. 
 
అనంతరం వెంటనే ఆయన కుమారుడు వెంకటేష్ స్వగ్రామం మదిరకు తీసుకెళ్ళారు. అప్పటినుంచి అక్కడే ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇటీవలే కాదంబరి కిరణ్ మనం సైతం నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వితరణగా ఇచ్చారు. తను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు కూడా. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు. ఆయన మ్రుతికి టీవీ అసోసియేషన్ సంతాపాన్ని ప్రకటించింది.
 
వీరభ్రదం రంగస్థలం నుంచి సినిమారంగంలోకి ప్రవేశించారు. సినిమాలలో ఐదు వందల రూపాయలనుంచి పదిహేను వేల రూపాయల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకున్నారు. టీవీలతోపాటు పలు వెబ్  సిరీస్ లో కూడా ఆయన నటించారు. క్యూట్ శాన్వీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహాంచారు. ఆయన మరణం పట్ల ఆయనతో అనుబంధం వున్న సీనియర్ నటులు, మా కూాడా సంతాపాన్ని ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు