అనారోగ్యంతో కోలీవుడ్ దర్శకుడు కన్నుమూత

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:29 IST)
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం వేట్టైక్కారన్ చిత్ర దర్శకుడు బాబు శివన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయనకుబార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిజానికి కరోనా వైరస్ మహమ్మారితో పాటు.. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాబు శివన్ చనిపోవడంతో కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. 
 
గతంలో హీరో విజయ్‌ నటించిన చిత్రం వేట్టైక్కారన్. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాగే విజయ్‌ హీరోగా ఏవీఎం సంస్థ  నిర్మించిన 'కురివి' చిత్రానికి సంభాషణలు అందించారు. తదుపరి బుల్లి తెరపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. 
 
కాలేయం, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాబు శివన్‌ వైద్యం ఫలించక బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్‌ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు