రజని కాంత్ 170 సినిమా టైటిల్ వేట్టైయాన్ (హుంటర్) ప్రకటన

మంగళవారం, 12 డిశెంబరు 2023 (20:11 IST)
Vettaiyan, Rajinikanth
సూపర్ స్టార్ రజని కాంత్  పుట్టిన రోజు నాడు  170 సినిమా టైటిల్ ను ప్రకటించారు. వేట్టైయాన్ అనే పేరు పెట్టారు. తెలుగులో హంటర్ అనే అర్ధం వస్తుంది. ఈరోజు చిన్న గ్లిమ్ప్స్ విడుదల చేశారు. రౌడీలను వేటాడే హంటర్ గా తలైవా కనిపించారు. T. J. జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించిన తమిళ భాషా చిత్రం. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ అల్లిరాజా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ మరియు దుషార విజయన్ వంటి సమిష్టి తారాగణం నటించారు. కాగా,  లాల్ సలాం టీం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మొయిదీన్ భాయ్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిసున్న ప్రోమో కూడా విడుదల చేశారు.  ఐశ్వర్య  దర్శకత్యం వహించిన ఈ సినిమా పొంగల్ 2024 ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం & కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు