చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేటి సమాజంలో చాలామంది తోటి స్నేహితుల ఒత్తిడి కారణంగా చెడు అలవాట్లను బానిసైపోతున్నారు. తద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీనిపై అవగాహన కల్పించే దిశగా 'టీనేజ్ ఫౌండేషన్' అనే సంస్థ ఓ వీడియో రూపంలో సందేశం ఇచ్చింది.
ఇందులో కొన్ని సీన్లలో వెంకీని చూపించి.. 'పీర్ ప్రెజర్' అనే అంశం గురించి మాట్లాడించేలా చేసింది. జీవితాన్ని మరొకరి చేతుల్లో పెట్టొద్దు, తోటివారి ఒత్తిడికి లొంగొద్దు అనే చక్కటి సందేశంతో వచ్చిన ఈ వీడియోను వెంకటేశ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. చెడు అలవాట్లన్నీ ఆరంభంలో సరదాగా ఉంటాయి. ఆపై అందరూ చేస్తున్నప్పుడు.. తప్పేముందనే క్లారిటీకి వస్తారు.
ఫ్రెండ్స్ దూరమైపోతారనే భయంతో దురలవాట్లకు అలవాటు పడితే బంగారు లాంటి జీవితం మీ నుంచి దూరమవుతుంది. అందుకే స్నేహితులు అలవాటు చేసే దురలవాట్లకు ఒక్కసారి నో చెప్పండి.. వారు మిమ్మల్ని వదిలేసినా పర్లేదు. జీవితం మీకు ముఖ్యమని భావించండి. అందుకే చెడు అలవాట్లకు నో చెప్పండి. చెడు అలవాట్లను ప్రోద్భలించే స్నేహితుల గురించి పెద్దగా ఆలోచించకండి.. అని వెంకీ చెప్తున్న మాటలు యువతను ఆలోచింపజేస్తున్నాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో లైకులు, షేర్లు పెరిగిపోతున్నాయి.