తాజాగా తన సోషల్‌మీడియాలో ఫొటోను షేర్ చేసింది. చెట్టుకు ఆనుకుని వుంటూ, వయ్యారాలు ఒలక పోస్తూ వున్న ఆ ఫొటోలో తన టైస్‌ను చూపించింది. ఇది ప్రముఖ ఫొటో గ్రాఫర్ డబు రత్నాని కేలండర్ కోసం షూట్ చేసింది. ఇటీవలే రత్నాని విజయ్‌దేవరకొండ ఫొటో షూట్ చేశారు. అంతకుముందు సన్నీలియోన్ ఫొటో షూట్ చేశాడు. సన్నీకైతే ఏకంగా ఓ చెట్టు ఆకు మాత్రమే అడ్డుపెట్టుకుని నగ్నంగా వున్న ఫొటో షూట్ అది. మరి విద్యాబాలన్‌కు వచ్చేసరికి కాస్త సెన్సార్ చూపించాడు. ఈ ఫొటో షూట్ అనంతరం ఆమె మాట్లాడుతూ, నా దృష్టిలో ఆడ, మగా ఇద్దరూ సమానమే. ఆడపిల్ల ఒంటింటికి పరిమితం అవ్వాలనుకోవడం అనాగరిక ఆచారం అంటూ ఘాటుగా స్పందించింది.