చాలా కాలం విరామం తీసుకున్న దర్శకుడు కె. విజయభాస్కర్ ఇప్పుడు తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' చేశారు. ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ ఈ రోజు హీరో విక్టరీ వెంకటేష్ 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని గ్రాండ్ గా విడుదల చేశారు.
వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా జిలేబి లా స్వీట్ గా ఉంటుందని నాకు నమ్మకం వుంది. విజయభాస్కర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు ఆయన ఎంతో చక్కగా తీశారో మనకి తెలుసు. జిలేబి తప్పకుండా ఒక ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను. నటుడిగా పరిచయం అవుతున్న కమల్ కి ఆల్ ది బెస్ట్. శివాని, కమల్ ఇద్దరూ మంచి పాత్రలతో అలరిస్తారనే నమ్మకం వుంది అన్నారు.