Devarakonda: కవాయ్ ఐల్యాండ్స్ వెకేషన్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ

దేవీ

శనివారం, 13 సెప్టెంబరు 2025 (16:14 IST)
US. Kauai Islands, Vijay Deverakonda
హీరో విజయ్ దేవరకొండ ఇటీవల యూఎస్ లోని కవాయ్ ఐల్యాండ్స్ వెకేషన్ వెళ్లారు. ఈ ఐల్యాండ్స్ లో బ్యూటిఫుల్ నేచర్ ను ఎంజాయ్ చేసిన ఫొటోస్, వీడియోస్ ఇన్ స్టా ద్వారా షేర్ చేశారు విజయ్. హవాయ్ లోని కవాయ్ ఐల్యాండ్స్ వర్సటైల్ నేచర్ కు ప్రసిద్ధి. హిస్టారికల్ గానూ ఈ ఐల్యాండ్స్ కు ఎంతో ప్రత్యేకత ఉంది.
 
ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఈ ట్రిప్ కు వెళ్లడం హ్యాపీగా ఉందని విజయ్ దేవరకొండ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కవాయ్ ఐల్యాండ్స్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. మరో వెకేషన్ వెళ్లేలోగా తన ప్రెజెంట్ మూవీస్ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఇటీవల కింగ్డమ్ తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం రౌడీ జనార్థన, వీడీ 14 చిత్రాల్లో నటిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు