Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

ఐవీఆర్

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (17:06 IST)
బాబా వంగా భవిష్యవాణి 2026 గురించి అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. బాబా వంగా కలియుగ అంతంగా చెప్పుకునే 5079 సంవత్సరం దాకా భవిష్యవాణి చెప్పినట్లు ప్రచారంలో వుంది. ఐతే ఆ విషయాలేవీ వ్రాత రూపేణా లేవు. కనుక ఈ భవిష్యవాణిపై భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ బాబా వంగా భవిష్యవాణిపై ఆసక్తి మాత్రం ఏ యేటికి ఆ ఏడు పెరుగుతూనే వుంది.

ఇక అసలు విషయానికి వస్తే... వచ్చే 2026 సంవత్సరంలో ప్రపంచంలో పరిస్థితులు ఎలా వుంటాయన్నది బాబా వంగా చెప్పేసారట. వీటికి సంబంధించి కొన్ని ప్రచారం అవుతున్నాయి. బాబా వంగా చనిపోయే ముందే... అంటే 1996కి ముందే 5079 సంవత్సరం వరకూ ప్రపంచంలో ఏమేమి జరుగుతాయో చెప్పేసిందట. ఆమె చెప్పినవన్నీ కొన్ని వాస్తవరూపం దాల్చడంతో వంగా భవిష్యవాణిని విశ్వసించేవారు క్రమంగా పెరుగుతూ వచ్చారు.
 
బాబా వంగా చెప్పిన భవిష్య వివరాల ప్రకారం... 2026 నుంచి 2028 మధ్య కాలంలో అగ్రరాజ్యం అమెరికా సైనిక, ఆర్థిక వ్యవస్థలను చైనా దాటేస్తుందట. అంతేకాకుండా... ఈ అగ్ర రాజ్యాల ఆధిపత్య పోరు వల్ల మూడో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం వున్నట్లు బాబా వంగా చెప్పినట్లు తెలుస్తోంది. 
 
భారతదేశం విషయానికి వస్తే... ప్రకృతి సృష్టించే బీభత్సం ఎక్కువగా వుంటుందట. వరదలు, కొండచరియలు విరిగిపడటం, రికార్డ్ బద్ధలు కొట్టే ఉష్ణోగ్రతల వల్ల భారతదేశంలోని పలు నగరాల్లో తాగునీటి సమస్య విపరీతంగా వుంటుందట. ఈ సమస్యలు రాజకీయ నాయకుల పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని బాబా వంగా పేర్కొన్నారు. ఐతే సైంటిస్టులు మాత్రం బాబా వంగా భవిష్యవాణిని కొట్టిపారేస్తున్నారు. వ్రాతపూర్వకంగా లేని సమాచారాన్ని పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నారు. ఐతే కొన్ని ఘటనలు బాబా వంగా చెప్పినట్లు జరగటంతో ఆమె భవిష్యవాణిపై చాలామంది నమ్ముతుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు