దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఠాగూర్

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (16:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో దసరా సంబరాలు మిన్నంటాయి. దీనికి నిదర్శనమే ఆ రాష్ట్రంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. కేవలం 2 రెండు రోజుల్లో ఏకంగా రూ.419 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అని అధికారులు తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం సెప్టెంబరు 30వ తేదీన రూ.333 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత అక్టోబరు 1వ తేదీన మరో రూ.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు వెల్లడించారు. నిజానికి సెప్టెంబరు 26వ తేదీ నుంచే రాష్ట్రంలో మద్యం విక్రయాలు రెట్టింపు అయినట్టు అధికారులు వెల్లడించారు. 
 
అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించింది. అదే రోజు దసరా పండగు కూడా ఉండటంతో మందుబాబులు ఒక రోజు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు. 
 
ఈ కారణంగా అక్టోబరు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, లిక్కర్ మార్ట్‍ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. పలు చోట్ల మధ్య కోసం జనం బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. పండగ సీజన్‌తో పాటు డ్రై డే కూడూ కలిసి రావడమే ఈ భారీ అమ్మకాలకు ప్రధాన కారణమని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు