Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

సెల్వి

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (16:53 IST)
cough syrup
రాజస్థాన్- మధ్యప్రదేశ్‌లలో నకిలీ దగ్గు సిరప్ సేవించి కనీసం 11 మంది పిల్లలు మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 
 
రాజస్థాన్‌లో, ఇద్దరు పిల్లలు మరణించగా.. వారిద్దరూ భరత్‌పూర్, సికార్‌కు చెందిన వారుగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లో తొమ్మిది మంది చిన్నారులు దగ్గు సిరప్ కారణంగా ఎందుకు మరణించారనే దానిపై దర్యాప్తు జరుగుతుందని అసోసియేట్ ప్రొఫెసర్- పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ పవన్ నందూర్కర్ తెలిపారు. 
 
సిరప్‌ను పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు. నివేదికలు ఇంకా పెండింగ్‌లో వున్నాయి. ఇప్పటికే కోల్డ్రిఫ్, నెస్టో డిఎస్ దగ్గు సిరప్‌ల అమ్మకాలను జిల్లా యంత్రాంగం ప్రస్తుతం నిషేధించింది. వాటి పరీక్ష నివేదికలు వచ్చే వరకు వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
బాధిత పిల్లల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మొదట్లో జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారని, ఆ తర్వాత వారి మూత్రపిండాల పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. మూత్రపిండాల వైఫల్యానికి గల కారణాన్ని పరిశీలించడానికి కేంద్రం, రాష్ట్ర అధికారులను పిలిపించామని ప్రధాన వైద్య- ఆరోగ్య అధికారి (సీఎంహెచ్ఓ) డాక్టర్ నరేష్ గున్నడే తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు