హీరో విష్ణు మంచు కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మధుబాల.. వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు.