బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన 11 మంది సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలంటూ విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణ హాజరైంది. ఈ నెల 25వ తేదీన మరోసారి ఈ విచారణకు హాజరుకావాల్సింది.
ఈ క్రమంలో తనపై నమోదైంది. ఈ రెండు ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులు సహకరించాలని ఆమెను ఆదేశించింది. చట్ట ప్రకారం విష్ణుప్రియను విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.