వివాహం చేసుకుంటాననే బూటకపు వాగ్ధానంతో మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తి చట్టం పరిశీలన తప్పించుకోజాలరని, ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం బంధం వాస్తవ రూపందాల్చడంలోని కష్టాలను ముందే అంచనా వేయాల్సిన అదనపు బాధ్యత వయసు రీత్యా తనకన్నా పెద్దదైన మహిళదేనని, వాదించడం వేయాల్సి పురుషాధిపత్య, స్త్రీ ద్వేష దృక్పథంగానే పరిగణించాల్సిన వస్తుందని జస్టిస్ స్వరణ కాంత శర్మ తెలిపారు.
పెళ్లి చేసుకుంటానంటూ బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత మోసం చేసిన వ్యక్తిపై దాఖలైన అత్యాచారం కేసును కొట్టివేసేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు తీవ్రత దృష్ట్యా నిందితుడుపై దాఖలైన కేసును పూర్తిస్థాయి విచారణ జరగకుండానే కొట్టివేయడం సరికాదని తేల్చి చెప్పారు. సహ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి తొలుత స్నేహితుడుగా మారి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని వెంటపడటంతో పాటు ఆమెకు వచ్చిన వివాహ సంబంధాలను తిరస్కరించేలా చేసి 2018 నుంచి 2021 వరకు మూడేళ్ల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించాడు.