సోషల్ మీడియాకు సెలెబ్రిటీలు దూరంగా వుండాలని దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కోవిడ్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యను ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్ సమయంలో తన స్నేహితుడి తండ్రి అనారోగ్యానికి గురయ్యారని.. బ్లడ్ అవసరమైతే ఆయన బ్లడ్ గ్రూపునకు సరిపడే డొనేటర్ కోసం చాలా వెతికామని.. ఈ క్రమంలో తన ఫోన్ నెంబర్ జత చేస్తూ డోనర్ కోసం సెర్చ్ చేశామన్నారు.
ఒకడైతే షర్టు లేకుండా ఫోటోలు పంపారు. ఆ దారుణాలు చెప్పలేను. నటీమణుల జీవితం ఇంత కష్టంగా వుంటుందా అని ఆ రోజు షాకయ్యానని తెలిపారు. కొంత కాలానికే ఆ ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసేశానని వివేక్ వివరించారు. అంటే సుందరానికి సినిమా ఫలితానికి తనదే బాధ్యత అని చెప్పారు. ఈ సినిమా నిడివి ఎక్కువైందని.. దాన్ని ఎడిట్ చేసేందకు వీలు పడలేదని ఆత్రేయ వెల్లడించారు.