సినిమాలకు పాటలు రాయాలంటే ముందుగా ట్యూన్‌ను విని రచయిత, సింగర్ పాటకు ఓ అందాన్ని తెస్తారు. కానీ ఎటువంటి ట్యూన్, లిరిక్ కూడా లేకుండా ఓ పాట రాయాలి. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి రాయాలి. అందులో రవితేజ కూడా వుంటాడు. అందుకే సంగీత దర్శకుడికి ఎంతగా ఆలోచించినా క్లారిటీ రాలేదు. అప్పుడు ఏదో పిచ్చిపిచ్చిగా రాసేస్తేపోలా అని అనుకుని రోల్‌రౌడాకు ఈ విషయం చెప్పాడట. సినిమా ఎవరికీ, ఎందుకు అనే సన్నివేశం చెప్పకుండా.. నీకు నచ్చిన విధంగా పిచ్చిపిచ్చిగా పాట రాసేయి. అవసరమైతే పాడి వినిపించు. అయితే ఇది మాస్ సాంగ్‌లా వుండాలి అనడంతో రోల్‌రైడా మాస్ పాటలు, జాతరలలో పాడేవాటిని మైండ్‌లో తీసుకుని రాసేసి, పాడి డి.ఎస్.పి.కి వినిపించాడట. అప్పుడు కొద్దిగా ట్యూన్‌ను డి.ఎస్.పి. బయటపెట్టాడు. అలా పూనకాలు పాట పుట్టుకొచ్చింది.. అని దేవీశ్రీప్రసాద్ తాజాగా తెలియజేశారు.