పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ భర్త నుంచి దూరమై పిల్లలను పెంచడంపై పూర్తిగా దృష్టి పెట్టింది. భర్తకు దూరమై పిల్లల ఆలనా పాలనా అంతా తానై చూసుకుంటున్న రేణూ దేశాయ్ ఇటీవల అనారోగ్యం పాలైంది. ఆ సందర్భంగా పిల్లలు, ఆమె పడిన కష్టాలను మీడియాతో పంచుకుంది. కొంతకాలం క్రితం తనకు తీవ్రమైన జ్వరం, ''ఆర్తో ఇమ్యూన్ కండిషన్'' సోకినప్పుడు పిల్లల బాగోగులు చూడలేక కష్టాలు పడ్డానని.. తన తల్లి కూడా వయసు మీద పడటంతో తమకు సాయం చేయలేకపోయిందని చెప్పుకొచ్చింది.
ఆర్తో ఇమ్యూన్ కండిషన్ సోకినప్పుడు చికిత్స కోసం చాలా కాలం పట్టిందని.. ఆ సమయంలో గుండె సమస్యతో ఇంటికి, ఆస్పత్రికి తిరుగుతూ ఇబ్బందులు పడ్డానని చెప్పింది. ఇలా ఓ సారి తాను వేసుకున్న మాత్రల కారణంగా గాఢ నిద్రలోకి వెళ్లగా, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్యా, లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణు దేశాయ్ తెలిపింది.
తనకు మెలకువ వచ్చేసరికి "ప్లీజ్ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్" అని ఒకటే ఏడుపని వెల్లడించింది. దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను మనసులోనే దాచుకుంటూ, తాను చనిపోనని మీతోనే వుంటానని ప్రామిస్ చేశానని.. తాను చనిపోతే.. నీకు పెళ్లెవరు చేస్తారు.. నీ పిల్లలను ఎవరు చూసుకుంటారు... ఓని ఓదార్చానని తెలిపింది. మమ్మీని (రేణూ) దూరం చేయవద్దని దేవుడి ముందు చాలాసేపు కూర్చుని ప్రార్థించిందని రేణు చెప్పుకొచ్చింది.