మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో రవితేజ సరసన నటించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి అను తప్పుకుంది. దీంతో అను గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.