16 యేళ్ల బాలుడితో వివాహేతర సంబంధం.. భర్త మర్మాంగంపై దాడి చేసి చంపిన భార్య

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (08:34 IST)
ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఆ వివాహిత ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నల్లగొండ జిల్లా నల్లబండగూడెం గ్రామానికి చెందిన పుల్లయ్య, ప్రవళ్లిక ఇద్దరూ భార్య భర్తలు. పుల్లయ్య కోదాడ వ్యవసాయ మార్కెట్‌లో జూనియర్‌ సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నాడు. ప్రవళ్లిక, వరసకు అల్లుడైన 16 సంవత్సరాల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు. నెల రోజుల క్రితం ఎల్‌బీనగర్‌లోని మైత్రినగర్‌కు మకాం మార్చారు. దీంతో పుల్లయ్య మీద ప్రవళ్లిక, ఆమె ప్రియుడు కసి పెంచుకున్నారు. 
 
ఎలాగైనా భర్త అడ్డు తప్పించాలని భావించిన ప్రవళ్లిక, ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. శనివారం ప్రవళ్లిక ప్రియుడు పులయ్య ఇంటికి వచ్చాడు. పుల్లయ్యతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య మీద అతడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దాడి చేసి మర్మాంగాలను గాయపరిచారు. గొంతు నొక్కి చంపారు. తెల్లవారకముందే మృతదేహాన్ని నగర శివారుల్లో పాతిపెట్టాలని భావించారు. 
 
రాత్రి 11.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తీసుకుని ప్రవళ్లిక, ఆమె ప్రియుడు బయలుదేరారు. పెద్దఅంబర్‌పేట్‌ చెక్‌ పోస్టు దగ్గర పోలీసులు వారిని చూసి అనుమానించి వెంబడించారు. పుల్లయ్య శవాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి