కోవిడ్ లేకుంటే కలెక్షన్లు పెద్ద స్థాయిలో వుండేవిః అభిషేక్ అగర్వాల్. వివేక్ కూచిబొట్ల
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:44 IST)
Vivek Kuchibotla, Abhishek Agarwal
హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ `రాజ రాజ చోర`. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదలై మంచి పాజిటివ్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్. వివేక్ కూచిబొట్ల మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు.
- వరల్డ్‌వైడ్ గా ప్రేక్షకుల నుండి యునామినస్‌గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తప్పకుండా ఈ మూడు రోజుల్లో పెద్ద నంబర్స్ రాబోతున్నాయి అని నమ్ముతున్నాం.
- ఈనెల ఫస్ట్ తారీకు వరకు మేము రిలీజ్ డేట్ గురించి చర్చించలేదు. 7న ఎస్ ఆర్ కళ్యాణమండపం రిలీజై మంచి ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారు అని మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఓన్ రిలీజ్ చేయడం జరిగింది.
- కోవిడ్ లేకుంటే కలెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వచ్చేవి. ఆంధ్రాలో ఫిఫ్టి పర్సెంట్ ఆక్యుపెన్సి, టికెట్ రేట్లు కూడా తక్కువ.ఈ పరిస్థితుల్లోనే ఇంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటే సాధారణ పరిస్థితుల్లో చిన్న సినిమాల్లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యుండేది. అయినప్పటికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే సక్సెస్ ఎక్కువ కిక్ ఇస్తుంది కదా..
- దర్శకుడు హసిత్ గోలి ఈ కథ చెప్పినప్పుడే మా అందరికీ నచ్చింది. వెంటనే సినిమా చేద్దాం అనుకున్నాం ఆయన కథ చెప్పిన దానికంటే 10రెట్లు ఎక్కువ బాగా తీశారు. ఈ కథకి సంగీతం, సినిమాటోగ్రఫి అన్ని బాగా కుదిరాయి. అందువల్ల సినిమా ప్రజెంటేషన్ కి చాలా మంచి ప్రశంస వచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గరినుండి ఈ సినిమాపై మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.
- డైరెక్టర్ చాలా మెచ్యూరిటితో సినిమా తీశాడు. రవిబాబు జాయినైనప్పటి నుండి షూటింగ్ సమయంలో కాని ఎడిట్ రూమ్‌లో కాని చాలా ఎంజాయ్‌చేస్తూ సినిమా చేశాం.
- ఈ కథని శ్రీవిష్ణు, హసిత్ గోలి ఇద్దరు కలిసి వచ్చి చెప్పారు.
- మేం మొదటినుండి రివ్యూల విషయంలో పాజిటివ్ గా ఉన్నాం. అందుకే మందురోజే మీడియా వారికి ప్రీమియర్ షో కూడా వేశాం. అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి.
- ఫస్ట్ పాండమిక్ టైమ్‌లోనే 80% షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్‌డౌన్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశాం. కరోనా తగ్గగానే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది మార్చి24కి ఫస్ట్ కాపీ రెడీ చేసి ఏప్రిల్ లో మంచి డేట్ చూసుకుని రావాలి అన్నది ఒరిజనల్ ప్లాన్. అందుకే గంగవ్వతో చోర కథ రిలీజ్ చేశాం. కాని మళ్లీ లాక్‌డౌన్ వచ్చింది. దాంతో ఈనెల 19న సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇది మంచి నిర్ణయంగానే మేం భావిస్తున్నాం.
కార్తికేయ 2 - గూఢచారి 2
- కళ్యాణ్ దేవ్‌తో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాం. అలాగే కార్తికేయ 2 ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అది వీఎఫ్ఎక్స్ కి దాదాపు నాలుగు నెలలు పడుతుంది. అలాగే గూఢచారి 2 సినిమా ఉంది.