రాజా సాబ్ సినిమాను మూవీ టీమ్ ఎంతో డెడికేటెడ్ గా రూపొందిస్తున్నారని, ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనని నిధి చెబుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ రెండు భారీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ ప్రైజింగ్ మూవీస్ ను న్యూ ఇయర్ లో అనౌన్స్ చేయనుంది నిధి అగర్వాల్.