ప్రాథమిక హక్కులు, ఉపాధి అవకాశాలు, సామాజిక రక్షణలు, ప్రభుత్వాలు, యజమానులు, కార్మికుల మధ్య నిర్మాణాత్మక సామాజిక సంభాషణలపై దృష్టి కేంద్రీకరించడం.. న్యాయమైన ప్రపంచీకరణ ఎజెండాను ప్రోత్సహించడం సామాజిక న్యాయాన్ని ప్రధానాంశంగా ఉంచడంలో కీలకంగా మారింది.
ఫిబ్రవరి 20న ఈ సామాజిక న్యాయదినోత్సవాన్ని 'అంతరాలను తగ్గించడం, పొత్తులను నిర్మించడం' అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సామాజిక పురోగతిని ప్రోత్సహించడానికి, ప్రజలందరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి జరుపుకుంటారు.
2007లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించింది. శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం సామాజిక న్యాయం అవసరమని గుర్తించింది. అప్పటి నుండి, ఈ రోజు పేదరికం, అసమానత, సాంఘిక బహిష్కరణ మూల కారణాలను పరిష్కరించడానికి ప్రపంచ సమాజం భాగస్వామ్య బాధ్యతను గుర్తు చేస్తుంది.