సీఎం జగన్మోహన్ రెడ్డిపై బయోపిక్ మూవీ (video)

శుక్రవారం, 2 జులై 2021 (13:45 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు జగన్ జీవిత, రాజకీయ చరిత్రల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
 
ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్తానాన్ని ‘యాత్ర’ మూవీగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహి.వి. రాఘవ్ ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగానే నటీనటుల ఎంపిక దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం. 
 
ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నాడని టాక్. తెలుగు రాష్ట్రాల్లో మాస్ లీడర్‌గా వైఎస్ జగన్ ఎదిగిన తీరు, పార్టీని నెలకొల్పిన 10 ఏళ్లలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన ప్రయాణం, సీఎంగా ఆయన ప్రస్థానం వంటి అంశాల ఆధారంగా బయోపిక్‌ను రూపొందించేందుకు కథను సిద్దం చేస్తున్నారట. 
 
ఇక ఈ మూవీలో జగన్ పాత్రలో ‘స్కామ్ 1992’ ఫేం ప్రతీక్ గాంధీ నటించాబోతున్నారని టాక్. ఈ సినిమాకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు