బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ఆదిత్య పంచోలీ భార్య జరీనా వహాబ్ మండిపడ్డారు. ఆదిత్య పంచోలీ తనను లైంగికంగా వేధించారంటూ కంగనా చేసిన ఆరోపణలపై జరీనా ఘాటుగా స్పందించారు. కొన్ని నెలల పాటు డేటింగ్ పేరుతో సంసారం చేసి, ఆ తర్వాత దాన్ని రేప్‌గా ఆరోపణలు చేయడమేంటని ఆమె ప్రశ్నించారు.
13 యేళ్ళ క్రితం ఆదిత్య, తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన చేసిన కామెంట్స్‌పై జరీనా తీవ్రంగా మండిపడ్డారు. ఓ పెళ్లయిన వ్యక్తితో ఏళ్ల పాటు డేటింగ్ చేసి, విడిపోయిన తర్వాత తనపై అత్యాచారం చేశారని ఆరోపించడం చాలా తప్పని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన జరీనా, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, మరోవైపు హృతిక్ రోషన్ పైనా కంగనా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.