డిసెంబర్ 4న విడుదలకానున్న 'కుబేరులు'

FileFILE
శివాజీ, ఆలీ, కృష్ణభగవాన్, ప్రధానంగా గోదావరి టాకీస్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కుబేరులు చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... 'కుబేరులు' అని టైటిల్‌తో పాటు ఉన్న 'వీళ్లకి అన్నీ అప్పులే' అనే క్యాప్షన్‌లో కామెడీ అంతా ఇమిడి ఉన్నట్లుగా వివరించారు. ముగ్గురి యువకుల చుట్టూ తిరిగే కథే ఈ చిత్రంగా పేర్కొన్నారు.

నటీనటులు దాదాపు పోటీ పడి నటించారని ప్రశంసించారు. ఎంఎస్ నారాయణ, రఘుబాబు, ఎల్‌బి శ్రీరాం, కొండవలస, ఏవీఎస్ తదితరులు హాస్యాన్ని పండించారన్నారు. ఈ చిత్రంలో పాతతరం నటి జ్యోతిలక్ష్మీ నృత్యం చేసిన ఓ పాట ప్రత్యేకమైనదన్నారు. ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన వస్తోందని చెప్పిన దర్శకుడు జీవన్ తామస్ చక్కటి బాణీలను అందించారన్నారు.

వెబ్దునియా పై చదవండి