సినిమాకు ప్రమోషన్ చాలా ముఖ్యం. ప్రతివారూ చెప్పేది.. కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని పబ్లిసిటీ విషయంలో.. ఉచితంగా సోషల్ మీడియాల్లో పెట్టేసి.. బాహుబలి టైప్‌లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. ఈ ట్రెండ్ అప్పటి నుంచి మొదలైంది. ఆ బ్యాచ్‌కు చెందిన సాయి కొర్రపాటి చకచక సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు.
మనమంతా సినిమా తీసి నష్టపోయాడు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమా బాగుందని చెప్పినా.. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో తాజాగా.. జ్యో అచ్యుతానంద సినిమా తీశాడు. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 9న విడుదలవుతుంది. ఈ సినిమా గురించి నిర్మాత పట్టించుకోకపోగా వివరాలను మీడియావారు అడిగితే.. అనాసక్తత వ్యక్తం చేశాడు.