సుశాంత్‌కు హిట్ కోసమే చైతు - అఖిల్‌లకు పాత్రలు.. ఫర్వాలేదనిపించే "ఆటాడుకుందాం రా" (రివ్యూ)

శుక్రవారం, 19 ఆగస్టు 2016 (14:22 IST)
నటీనటులు:
సుశాంత్‌, సోనమ్‌, బ్రహ్మానందం, వెన్నెలకిశోర్‌, పృథ్వీరాజ్‌, మురళీశర్మ, ప్రత్యేక పాత్రల్లో నాగసుశీల, నాగచైతన్య, అఖిల్‌ తదితరులు
 
సాంకేతికత:
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: నాగసుశీల, శ్రీనివాస్‌, కథ, మాటలు: శ్రీపాద సిపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగేశ్వరరెడ్డి.
 
అక్కినేని వంశంలో వారసుడిగా హీరోగా తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న హీరోల్లో సుశాంత్‌ ఒకడు. 'కరెంట్‌' చిత్రంతో తనలోని కరెంట్‌ను తీసుకువచ్చినా. ఆ తర్వాత రెండు చిత్రాలు బిలో యావరేజ్‌లో ఆడాయి. కొన్నాళ్ళ గ్యాప్‌తో 'ఆటాడుకుందాం రా'తో ముందుకు వచ్చాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ దర్శకుడిగా నాగేశ్వరరెడ్డి.. సుశాంత్‌తో చేసిన ప్రయోగం ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
సుశాంత్‌ ఎన్‌ఆర్‌ఐ. భారత్ వచ్చి సోనమ్‌తో ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరూ టైం మిషన్‌లో ట్రాప్ అవ్వాలనుకుంటారు. 50 యేళ్ళ ముందుకూ, వెనక్కూ వెళ్ళగలననే సత్తా ఉన్న ఆ మిషన్‌లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ ద్వారా వెళతారు. అప్పటికి ఇప్పటికే దర్శకత్వం, కథల్లో ఏదైనా తేడావుందోనేమో కనిపెట్టాలనుకుంటారు. ఆ దశలో పృథ్వీ అనే దర్శకుడి వద్దకు వెళతారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? అనేది సినిమా. ఇందులో అఖిల్‌, నాగచైతన్య పాత్రలేమిటి? అనేవి కూడా చూడొచ్చు.
 
పెర్‌ఫార్మెన్స్‌:
సుశాంత్‌ గత చిత్రాలతో పోల్చితే ఇందులో బాగానే చేశాడు. అక్కినేని ఫ్యాన్స్‌కు ఫర్వాలేదనిపిస్తాడు. యాక్షన్‌, డాన్స్‌లో ఓకే. కథానాయిక సోనమ్‌ బజ్వా గ్లామర్‌గా సూటయింది. ఇక బ్రహ్మానందం చాలాకాలం తర్వాత ఫుల్‌లెంగ్త్‌ రోల్‌ ఈ చిత్రంలోనే చేశాడు. ఇక మిగిలిన పాత్రల్లో గిరిజారావు, మురళీశర్మ, వెన్నెలకిశోర్‌. పృథ్వీ, రఘుబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. అఖిల్‌, నాగచైతన్య, సుశీల.. పాత్రలు కథప్రకారం సరిపోయాయి.
 
టెక్నికల్‌గా...
ముఖ్యంగా అనూప్‌ రూబెన్స్‌.. ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. ఆకట్టుకునే బాణీలు చూపించాడు. ఏఎన్నార్ 'దేవదాసు' చిత్రంలోని "పల్లెకుపోదాం.." అనే లైన్‌ను అక్కడక్కడ పెట్టి.. రీమిక్స్‌ ప్రయోగం బాగుంది. సంభాషణలపరంగా ఎంటర్‌టైన్‌చేసేలా శ్రీపాద రాసుకున్నాడు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నాగేశ్వరరావు గత చిత్రాల ఫార్మెట్‌లో ఉన్నా కొత్తగా ఉంది. 
 
విశ్లేషణ:
'కరెంట్‌ తీగ', 'దేనికైనా రెఢీ', 'ఆడోరకం ఈడోరకం' తర్వాత నాగేశ్వరరెడ్డి దర్శకత్వం చేసిన చిత్రమిది. తన ఎంటర్‌టైన్‌ మార్కుతో చిత్రాన్ని చేశాడు. సుశాంత్‌కు చాలాకాలం తర్వాత హిట్‌ కొట్టించాలని.. నాగచైతన్య, అఖిల్‌లను కథలో ఇన్‌వాల్వ్‌ చేసే విధానం బాగుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేసే ప్రయత్నం చేశాడు. మొత్తంగా సుశాంత్‌కు ఫర్వాలేదు అనిపించేలా చిత్రముంది.
 
రేటింగ్‌::  2.5..5 

వెబ్దునియా పై చదవండి