ఆది సాయి కుమార్‌ టాప్‌ గేర్‌ ఎలాందంటే! రివ్యూ

శుక్రవారం, 30 డిశెంబరు 2022 (14:15 IST)
Aadi Sai Kumar, Rhea Suman
నటీనటులు: ఆది సాయి కుమార్‌, రియా సుమన్‌, బ్రహ్మాజీ, మైమ్‌ గోపి తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, నిర్మాత: కె.వి.శ్రీధర్‌ రెడ్డి, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకుడు : శశికాంత్‌ 
 
ఆది సాయి కుమార్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘‘టాప్‌ గేర్‌’’. ప్రతి సినిమాకు కష్టపడుతున్న ఆదికి ఈసారైనా మంచి హిట్‌ వస్తుందని ఆశించాడు. గతంలో మంచి కథలతో ముందుకు వచ్చిన ఆయన ఈసారి కూడా సస్పెన్స్‌తో ముందుకు వచ్చాడు. హిందీ డబ్బింగ్‌ మార్కెట్‌ బాగుతున్న ఆదికి ఈ సినిమా నిర్మాతకు మంచి సేఫ్‌ సినిమాగా నిలిచింది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 
 
కథ :
అర్జున్‌ (ఆది సాయికుమార్‌) ఓ క్యాబ్‌ డ్రైవర్‌. కొత్తగా వివాహం చేసుకుంటాడు. సజావుగా సాగుతున్న అర్జున్‌ డ్రెగ్‌ రాకెట్‌లో ఇరుక్కుంటాడు. సిద్ధార్థ్‌ (మైమ్‌ గోపి) ఓ పెద్ద డ్రగ్‌ డీలర్‌. సింగపూర్‌ కి పారిపోవాలని ప్లాన్‌ చేసుకుని హైదరాబాద్‌ వస్తాడు. అయితే అనూహ్యంగా అర్జున్‌ ఈ డ్రగ్‌ రాకెట్‌ లో చిక్కుకోగా విలన్‌ చెప్పినట్లు ఓ ఛాలెంజ్‌ స్వీకరించాల్సి వుంటుంది. అందులో భాగంగా తన భార్య ఆధ్య (రియా సుమన్‌)ని కాపాడుకోవడం కోసం ఆ క్రిమినల్స్‌ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది. మరి అర్జున్‌ అలా చేశాడా? లేదా? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన కథ వెండితెరపై చూడాల్సిందే.
 
విశ్లేషణ:
డ్రగ్‌ మాఫియా అనేది పెద్ద కాన్సెప్ట్‌. దానిని తీసుకుని కొత్త ప్రయోగం చేశాడు దర్శకుడు. డ్రగ్‌ డీలింగ్‌ అంశాలు పై వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా సాగుతుంది. దర్శకుడు స్టడీ చేసి తీసినట్లుంది. ఇందులో ఆది సాయికుమార్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా నటుడిగా మెప్పించాడు. మంచి భర్తగా ఎమోషన్స్‌ని పండిరచాడు. అలాగే నటి రియా సుమన్‌ కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సత్యం రాజేష్‌, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో అయితే కొన్ని అంశాల్లో సినిమా ఇంప్రెస్‌ చేస్తుంది. కొన్ని సీన్స్‌ మంచి ఇంట్రెస్ట్‌ గా సాగగా నెక్స్ట్‌ అయితే కొన్ని అంశాలు డీటెయిల్స్‌ చూపించడంలో అలాగే ట్విస్ట్‌ లు బాగున్నాయి. 
 
ఇలాంటి కథలకు లాజిక్స్‌ ముఖ్యం. వాటిని కూడా చాలా ఇంట్రెస్టింగ్‌ గా చూపే క్రమంలో సినిమాటిక్‌గా ఫ్రీడం తీసుకున్నాడు. హీరో రోల్‌ ఓ టైం లో సాయం అందుకునే పరిస్థితి వస్తుంది కానీ దానిని మిస్‌ చేసారు. ముగింపులో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. డ్రెగ్‌ మాఫియా విషయంలో మరింత బెటర్‌మెంట్‌గా సీన్స్‌ రాసుకోవాల్సింది.  
 
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్ష వర్ధన్‌ ఇచ్చిన మ్యూజిక్‌ సినిమాలో డీసెంట్‌ గా ఉంది అలాగే తన బ్యాక్గ్రౌండ్‌ స్కోర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్‌ గా ఉంది. అలాగే డైలాగ్స్‌, ఎడిటింగ్‌ బాగున్నాయి.
 
దర్శకుడు శశికాంత్‌ తను అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాడు. అయితే రొటీన్‌ కథగా అనిపించినా కథనం విషయంలో కొంత ఆసక్తి కనబరిచాడు. మైండ్‌ గేమ్‌ సీన్స్‌ ని బాగా డీల్‌ చేసారు. అయితే క్లైమాక్స్‌ పోర్షన్‌ ని కానీ ఇంకా కొన్ని సీన్స్‌ ని అయితే బెటర్‌ గా చేసి ఉంటే బాగుండేది.
 
కథాపరంగా ‘‘టాప్‌ గేర్‌’’ టైటిల్‌ పెట్టడం బాగుంది. ఆది సాయి కుమార్‌ నటన మరింత మెరుగ్గా ఈ సినిమాలో కనిపించగా పలు సీన్స్‌ ఆసక్తిగా సాగుతాయి. దర్శకుడు ఇలాంటి థ్రిల్లర్‌ అంశాల్ని తీసుకుని మరింత బాగా తీయాల్సింది. థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిచెప్పాలి. ఓటీటీలో దీనికి మరింత ఆదరణ పొందుతుందని చెప్పవచ్చు.
రేటింగ్‌ 2.75/5 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు