కథ
కొత్తపల్లికి అనే ఊరికి చెందిన వర (అనురాగ్) పక్క ఊరైన దోసకాయపల్లిలో ఉమా (అవికా గోర్)ను ఇష్టపడతాడు. ఈ రెండు ఊర్లకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పగలుంటాయి. వర తండ్రి దుబాయ్ లో సంపాదిస్తుంటాడు. ఊరిలో బేవార్స్ గా తిరిగే వర తండ్రి డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. ఇక ఆ తర్వాత ఉమను వర ప్రేమిస్తున్నట్లు చెప్పాలి. అయితే ఉమ సోదరుడుకి వరకు ఫ్లాష్ బ్యాక్ లో గొడవ జరుగుతుంది. అలాంటి పరిస్థితులలో ఉమను వర ఏవిదంగా ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష..
టైటిల్ ను బట్టే ఉమా యొక్క పతి అనే అర్థం ఇచ్చేశాడు. దాంతో కథేమిటో ముందుగానే చెప్పినట్లయింది. మిగిలిన పాత్రలు వున్నా ప్రదానంగా ఉమ, వర పాత్రల చుట్టూ కథ సాగుంది. విలేజ్ ప్రేమ కథ గనుక పల్లె అందాలు, ప్రేమ కథ ఫ్రెష్ గా అనిపిస్తుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడు. అవికా గోర్ అందంగా కనిపిస్తూనే.. తన అల్లరితో, తన నటనతో అందరినీ కట్టి పడేసింది. వీరిద్దరి జోడికి ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇక మిగిలిన పాత్రల్లో హీరో ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.
ఈ తరహా పల్లెటూరి ప్రేమకథలు చాలానే వచ్చాయి. హీరో హీరోయిన్లు పాత్రలను బట్టి కథ సాగుతుంది. కనుకనే కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ప్రేమికుల గిల్లికజ్జాలు, మనస్పర్థలు ప్రేమ చిగురించే సన్నివేశాలు యూత్ ను అలరిస్తాయి. మొదటి భాగమంతా ఊరి వాతావరణం, గొడవలు, జోకులుతో కథను దర్శకుడు నడిపించాడు.
టెక్నికల్ గా చెప్పాలంటే పాటలలో సంగీతం కాస్త వినసొంపుగా వుంటుంది. రీరి కార్డింగ్ బాగుంది. సినిమాటో గ్రఫీ పల్లె వాతావారణాన్ని ప్రతిబించింది. సంభాషణ పరంగా కొన్ని బాగుంటే, మరి కొన్ని ఎమోషనల్ గా కట్టిపడేశాయి. అక్కడక్కడా క్రుతంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. చిన్న సినిమాల్లో ఓ మోస్తరు సినిమాగా తీర్చి దిద్దారు దర్శకుడు. యాక్షన్, వయెలెన్స్, రణగొన ధ్వనులతో ఇప్పుడు వస్తున్న సినిమాల నుంచి కాస్త ఊరట కలిగించే సినిమాగా కనిపిస్తుంది.