భజే వాయు వేగం సినిమా ఎలా వుందొో తెలుసా - రివ్యూ

డీవీ

శుక్రవారం, 31 మే 2024 (14:44 IST)
Karthikeya, Aishwarya Menon
నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్, సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల, నిర్మాతలు : యూవీ కాన్సెప్ట్స్, దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి
 
కార్తికేయ హీరోగా నటించిన చిత్రం “భజే వాయు వేగం” అంటూ ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. హనుమంతునికి సింక్ అయ్యేలా టైటిల్ వుండడంతో ఇది వాయివేగం లాంటి కథాంశంతో సాగుతుందని అనుకోవడం సహజం. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
ఓపెనింగ్ షాటే.. వెంకట్ (కార్తికేయ) పోలీస్ స్టేషన్ లో అరెస్టు అయి పలు కేసులు వున్నాయని ఎస్.ఐ. అంటాడు. అసలు తనపై కేసులు ఎందుకు వచ్చాయనేది ఫ్లాప్ బ్యాక్ వాయిస్ తో కొనసాగుతుంది. వరంగల్ లోని రాజన్న పేట గ్రామం. వెంకట్ (కార్తికేయ) చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటారు. అప్పును చెల్లించేందుకు తన దగ్గర పాలేరుగా చేయమని బలంతం చేస్తాడు. ఆ సమయంలో వెంకట్ కు స్నేహితుడైన రాజన్న (తనికెళ్ళ భరణి) వెంకట్ ని అక్కున చేర్చుకుంటారు. 
 
సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్) తో సమానంగా పెంచుతాడు. రాజు సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ ట్రై చేసి మోసపోతాడు. అలాగే వెంకట్.. క్రికెటర్ గా పేరు తెచ్చుకుంటాడు కానీ రంజీకి ఆడాలంటే డబ్బు కట్టాలి. ఇలా సతమతమవుతున్న వారికి తమ తండ్రికి ఆపరేషన్ నిమిత్తం పది లక్షలు సమకూర్చాల్సి వస్తుంది. దానికి ఈ అన్నదమ్ములు ఏం చేశారు? అలాగే సిటీ మేయర్ కూ, వీరికి వున్న లింకేమిటి? హీరోయిన్ కథేమిటి? అనేది వెండితెరపై చూడాల్సిందే.
 
సమీక్ష:
 
కథాపరంగా కొత్తదేమీకాదు. నేపథ్యం వేరుగా వుంది. ఇద్దరు విలేజ్ అన్నదమ్ములు, పక్క రాస్ట్రంనుంచి పారిపోయి రౌడీలుగా ఎదిగి మేయర్ స్థాయికి చేరి సిటీని శాసిస్తున్న అన్నదమ్ముల కథను లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం ఏమీలేకపోయినా సస్పెన్స్ క్రియేట్ చేయడానికి  ట్రై చేశాడు. ఆ దిశలో సాగే సన్నివేశాలు అప్పటికప్పుడు రాసుకున్నవిగా అనిపిస్తున్నారు.
 
కొన్ని సీన్లు అసంబధ్ధంగా అనిపిస్తాయి. తమ తండ్రి ఆపరేషన్ నిమిత్తం పది లక్షలు కోసం వెంకట్ తన క్రికెట్ కెరీర్ ను పణంగా పెట్టం, మరోవైపు అదేమీ చెప్పకుండా పది లక్షలు కోసం బెట్టింగ్ కట్టడం వంటివి సింక్ కుదరలేదు. ఈ పాయింట్  చిరంజీవి, రామారావు కాలం లాంటి కథగా అనిపిస్తాయి. కథనంలో కొత్తదనం పెద్దగా కనిపించదు.
 
మేయర్ బ్రదర్స్ చేసే విన్యాసాలు మామూలుగా వుండవు. ముఖ్యమంత్రిని కూడా శాసించే స్తాయికి వెళతారు. ఇక పెర్ ఫార్మెన్స్ గా అందరూబాాగానే చేశారు. కానీ కథలోనే పట్టు లేకపోవడంతో కష్టపడిందంతా ఫలితంలేకుండా పోయిందనే చెప్పాలి. మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుందేమో. రాహుల్ టైసన్ చాలా కాలం తర్వాత నటించాడు. 
 
 తనికెళ్ళ భరణి,  రవి శంకర్ పూర్తి న్యాయం చేశారు. అలాగే కొన్ని సీన్స్ లో తన కన్నింగ్ నెస్, కొన్ని హావభావాలతో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని అందించారు. ఇంకా తన అన్నయ్య పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు శరత్ లోహితిస్వ కూడా మంచి రోల్ చేసి తన రోల్ కి న్యాయం చేసారు. దర్శకుడు రాసుకున్న లైన చోట్ల బలహీనంగా అనిపిస్తాయి.
 
సీరియస్ మూవీ కనుక పెద్దగా పాటలు వుండవు. హీరోయిన్ వుండాలి కాబట్టి వుంది. ఆమె క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యత వుండదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంభాషణలు బాగున్నా, సన్నివేశాల్లో కొత్తదనం లేదు. లాజిక్ లను మర్చిపోయి సినిమా తీస్తే గందర గోళంగా వుంటుంది. దానిని సరిచేసుకుంటే  సినిమా మరోలాావుండేది. 
 అయితే ,“భజే వాయు వేగం” టైటిల్ కథకు ఏ మాత్రం సింక్ లేకుండా వుంది. రొటీన్ సినిమాలా అనిపిస్తుంది.
రేటింగ్ : 2/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు