నాగశౌర్య. కథానాయకుడిగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తరునంలో కొత్త దర్శకుడు అనీష్ కృష్ణతో చేసిన కొత్త చిత్రం.. 'కృష్ణ వృంద విహారిస. బ్రాహ్మణుడి పాత్ర పోషించానని ప్రచారంలో చెప్పిన ఆయన నటించిన సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాగశౌర్యకు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా చూద్దాం.
కథ:
కృష్ణ (నాగశౌర్య) సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. తల్లి రాధిక, తండ్రి విజయ్ కుమార్. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం కాబట్టి ఊరిలో అందరూ అన్న అంటుంటారు. ఇక ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వస్తాడు. తన బావ బ్రహ్మాజీ ఇంటిలోనే మకాం. ఒకరోజు ముందుగానే మంచి రోజని సాప్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడనుంచి నచ్చిన అమ్మాయి వ్రిందా (షెర్టి)ని ప్రేమించేస్తాడు. ఆమె తన బాస్. ఢిల్లీకి చెందిన అమ్మాయి. నాన్‌వేజ్ కుటుంబం. ఆమెకు ఓ సమస్య వుంటుంది. అయినా సరే ఆమెంటే పడిచచ్చేంత లవ్‌తో కృష్ణ పెండ్లి చేసుకుంటాడు. పెండ్లయిన 5 నెలలకే వ్రిందా గర్భవతని తెలుస్తుంది. ఆ తర్వాత చిన్నపాటి గొడవలతో విడాకులవరకు వెళతారు. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
విశ్లేషణ:
ఈ సినిమా మొదటిభాగమంతా పెద్దగా కనెక్ట్ కాదు. సప్పగా సాగిపోతుంటుంది. బ్రాహ్మణ కుటుంబం అలవాట్లు,ఆచారాలు హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ జాబ్. అక్కడ పబ్ కల్చర్.. ఇలా సాగిపోతుంటుంది. ఇదంతా అప్పటికే నాని చేసిన అంటే సుందరానికి జిరాక్స్‌లా అనిపిస్తుంది. అందులోనూ హీరోయిన్‌కు సమస్య. ఇందులోనూ హీరోయిన్‌కూ, హీరోకు సమస్య పెట్టాడు. అందుకే ఒక్కడక్కడా కామెడీ ట్రాక్ పెట్టి సినిమాను తీశాడు. వెన్నెల కిశోర్, సత్య, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో నాగశౌర్య చేసే పనులే ఎంటర్‌టైన్ చేస్తాయి. అప్పుడప్పుడు నాగశౌర్య బావ బ్రహ్మాజీ పాత్ర కాస్త ఎంటర్‌లైన్ చేస్తుంది.
ఇంతకుముందు 'అలా ఎలా' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు అనీష్ కృష్ణ. ఆ సినిమాలో సింపుల్ హ్యూమర్ తో అతను మెప్పించాడు. ఐతే ఆ తర్వాత అనీష్ నుంచి ఇలాంటి వినోదాత్మక చిత్రాలు ఆశిస్తే.. అందుకు భిన్నంగా లవర్, గాలి సంపత్ సినిమాలు తీసి నిరాశ పరిచాడు. దాన్నుంచి బయటపడాలని తీసిన కృష్ణ విందా.. మాత్రం ఏమంత ఆశాజనకంగా తీయలేకపోయాడు. పాటలు పర్వాలేదు. సంగీతం ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎటొచ్చీ కథే సరిగ్గా లేదు. అప్పటికే నాని సినిమా రావడంతో ఆ పోలిక తప్పకుండా మైనస్ అవుతుంది.
ఇక సినిమాలో హీరోయిన్ లో వున్న లోపం తనలోపంగా తన ఇంటిలో చెప్పి హీరో పెండ్లికి ఒప్పించడం వెనుక బలమైన ప్రేమ అంశం కనిపించలేదు. అయితే ఆ పాయింట్‌తోనే పూర్తి ఎంటర్‌టైన్ చేయాలనుకున్న దర్శకుడు కథ సరిగ్గా లేకపోవడంతో చాలా చోట్ల నిరుత్సాహ పరుస్తాడు. కేవలం నాలుగు ఐదు కామెడీ ట్రాక్‌లు రాసుకుని సినిమా కాస్త ఊరట కలిగించాడు. లేకపోతే ఈ సినిమా చూడ్డం కష్టమే అని చెప్పాలి.
- 'అంటే సుందరానికీ'లో కూడా లోపం పాయింట్ ను చాలా బలంగానే చెప్పే ప్రయత్నం జరిగినా.. మంచి హ్యూమర్ జోడించినా.. కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సేమ్ టు సేమ్ ఆలోచన ఎలా వచ్చిందో కానీ అలాంటి కథతో మరో ప్రయత్నం చేయడంకూడా సాహసమే. ఇక విడాకులవరకు రావడం అనేది కూడా పెద్దగా అతకలేదు. ఏవో సినిమాటిక్ డైలాగ్‌లు చెప్పేసి రక్తికట్టించాలని చూశారు. ఒక రొటీన్ టెంప్లేట్లో సాగిపోతుందీ సినిమా. అందుకే మధ్య మధ్యలో సత్య పాత్రతో చేయించిన కామెడీ బాగానే వర్కవుట్ అయింది.
- ఇక ద్వితీయార్ధంలో వచ్చే ఫ్యామిలీ డ్రామా సీరియల్స్‌లో చాలానే కనిపిస్తాయి. తను తల్లి అయ్యానని తెలుసుకున్న హీరోయిన్ ఆ ఆనందాన్ని తన తల్లిదండ్రులకు అస్సలు చెప్పకపోవడం దర్శకుడు తప్పిదమే. భర్తకు చెప్పి ఆనందించాలనుకున్నా చెప్పలేని పరిస్థితి. ఈలోగా హీరో తనకు తాను వేసుకున్ నిందనుంచి ఎలా బయటపడ్డాడనేది సినిమా. ఈ పాయింటే సినిమా తీయడానికి కారణమైంది.
- నాగశౌర్య అమాయకత్వంతో కూడిన పాత్ర చేసినా మధ్య మధ్యలో చేసే యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయి. హీరోయిన్ కొత్త అమ్మాయి కావడంతో ఫీలింగ్స్ పలికించలేకపోయింది. మిగిలిన వారంతా బాగానే చేశారు. సంగీతంలో మహతి స్వర సాగర్ ఆకట్టుకున్నాడు. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఈ కథకు తగ్గట్లుగా కుదిరాయి. కథలో బలమైన పాయింట్ లేకపోవడంతో కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సెకండాఫ్‌లో. అది కూడా లేకపోతే సినిమా సప్పగా వుండేది.