అజిత్ సినిమా వీరమ్‌కు రీమేక్‌గా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం (మార్చి-24)న రిలీజైంది. తమిళంలో శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వీరుడొక్కడేగా తెలుగులో డబ్బింగ్ సినిమాగా రిలీజైంది. ఈ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాలో పవన్ నటించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫట్ అయ్యాక.. గోపాల గోపాల ఫేమ్ ప్రొడక్షన్ హౌస్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్పై ఈ సినిమా రిలీజైంది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం..
కథలోకి వెళితే..
కాటమరాయుడు (పవన్ కల్యాణ్) పవర్ ఫుల్ వ్యక్తిగా తన నలుగురు సోదరులతో గ్రామంలో ఉంటుంటాడు. అజయ్, శివబాలాజీ, కమల్, చైతన్య కామరాజు సోదరులుగా కనిపించారు. అయితే కాటమరాయుడికి పెళ్లి అంటే పడదు. అయితే అతని సోదరులు మాత్రం కాటమరాయుడికి పెళ్లి చేయాలని.. ఆపై తాము కూడా వివాహం చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో అవంతిక (శ్రుతిహాసన్) ప్రేమలో కాటమరాయుడు పడేలా చేస్తారు. అయితే కాటమరాయుడు అవంతికను ప్రేమించి.. అవంతిక కోసం ఆమె తండ్రి వద్ద మంచి పేరు కొట్టేందుకు కాటమరాయుడు వారి గ్రామానికి వెళ్తాడు. కానీ అక్కడ అవంతిక తండ్రి నాజర్ కుటుంబాన్ని శత్రువుల నుంచి సీక్రెట్‌గా ఎలా కాపాడాడు. చివరికి అవంతికను పెళ్లి చేసుకున్నాడా? సోదరులకు కూడా పెళ్లి చేశాడా? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మెన్స్..
కాటమరాయుడు మేనరిజంకు పవన్ కల్యాణ్ బాగా సూటైయ్యాడు. ఫ్యాన్స్ అంచనాలకు తగిన నటన, డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ శ్రుతిహాసన్ నటన అదిరింది. అందమైన లుక్‌తో సాఫ్ట్ రోల్‌ను అదరగొట్టేసింది. రావు రమేష్, నర్సప్ప తమ తమ పాత్రల్లోనే జీవించారు. అలీ, పృధ్వీల కామెడీ అదిరింది. ఇక పవన్ సోదరులుగా అజయ్, శివ బాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రుతిహాసన్ తండ్రిగా నాజర్ కుదిరిపోయాడు. కాటమరాయుడు కథ కొత్తది కాకపోయినా.. స్క్రీన్ ప్లే, డైలాగులు అదిరాయి.
విశ్లేషణ:
అనూప్ రూబెన్స్ రాసిన పాటలు బాగున్నాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్, స్టంట్స్, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ విలువలు, ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రాఫీ కథకు సరిపోయింది.
హైలైట్స్
పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో.
కామెడీ సీన్స్
మైనస్
రెండో అర్థ భాగం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్టోరీ... అయితే కమర్షియల్ చిత్రంగా ఫ్యాన్స్‌కు కాటమరాయుడు నచ్చుతాడు. యావరేజ్ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది.