థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

దేవీ

శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (07:36 IST)
Pravinkudu Shappu POSTER
నూతన దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ తెరకెక్కించిన చిత్రం ప్రవీణ్ కూడు షప్పు. ఇందులో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించారు, చాందిని శ్రీధరన్, శివాజిత్, శబరీష్ వర్మ, నియాస్ అబూబెకర్, జోసెఫ్ జార్జ్, విజో (మణి), సందీప్, రేవతి, రామ్‌కుమార్, రాజేష్ అజీకోడన్, దేవరాజ్, ప్రతాపన్,  జ్యోతికలు కనిపిస్తారు. ఈ సినిమా సోనీ లైవ్ లో ఏప్రిల్ 11,2025 తెల్లవారుజాము నుంచే టెలికాస్ట్ అవుతుంది.
 
కథగా చెప్పాలంటే:
ఓ గ్రామంలో జరిగే కథ. ఓ కల్లు దుకాణం. దాని యజమాని కొంబన్ బాబు. కొబ్బరిచెట్టనుంచి తీసిన కల్లును తాగుతూ పేకాట ఆడుతూ కొందరు ఎంజాయ్ చేస్తుంటారు. ఓ తుఫాను రాత్రి, పదకొండు మంది వినియోగదారులు ఒక కల్లు దుకాణంలో తాగుతూ, పేక ఆడుతూ గడుపుతారు. వారిలో వారు ఇద్దరు గొడవపడి కొట్టుకుంటూ కిందపడతారు. ఆ తర్వాత పైకి చూస్తే దుకాణ యజమాని కొంబన్ బాబు దుకాణం మధ్యలో వేలాడుతూ కనిపిస్తాడు. 
 
ఆ తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేస్తారు. ఎస్.ఐ. సంతోష్ చేసిన దర్యాప్తులో కొన్ని చీకటి కోణాలు కనిపిస్తాయి. అందులో మెరిండాకూ రిటైర్డ్ మిలట్రీ వ్యక్తికి, ఆమె భర్తకూ, కొంబన్ బాబూకూ గల రిలేషన్ ఏమిటి? ఎస్.ఐ. సంతోష్ తన టీమ్ తో ఏవిధంగా ఆత్మహత్యను మర్డర్ గా నిరూపించాడా? లేదా? అనేది సినిమా.
 
సమీక్ష: 
 శ్రీరాజ్ శ్రీనివాసన్ తన తొలి ప్రయత్నంలో దర్శకత్వం వహించి, రాసిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రవీణ్ కూడు షప్పు అసాధారణమైన సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంది, ఇందులో అందరూ పాత్రలపరంగా బాగా నటించారనేచెప్పాలి. ఎక్కువ భాగం రాత్రి పూట జరిగే కథతోపాటు తాగినతర్వాత నోటినుంచి వచ్చే సంభాషణలు, నేపథ్య సంగీతం, బ్యాక్ గ్రౌడ్ గీతం కథనాన్ని సాగేలా చేశాయి. సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్ మరియు చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఎస్.ఐ. సంతోష్ పాత్రలో పోలీసుకుండాల్సిన ఎదుటివారిని ఎనలైజ్ వేసే తనం, ఎలెర్ట్ నెస్ దర్శకుడు బాగా చూపించాడు. తప్పుచేస్తే పోలీసు స్టేషన్లలో నిందితులను కొట్టేవిధానం ఊళ్ళలో వుండే మొరటు శిక్షలు కనిపిస్తాయి. చిన్నపాయింట్ ను  తీసుకుని మర్డర్ మిస్టరీగా  దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ తీసినా మరింత ఆసక్తిగా మలచలేకపోయాడు. కథనంలో రివర్స్ స్క్రీన్ ప్లే ప్రయోగించాడు.
 
కథలో రకరకాల పాత్రలు వారి తీరుతెన్నులు సరికొత్తగా అనిపిస్తాయి. మెరిండా అనే మహిళ ఎవరిని ఇష్టపడుతుందో అనేది దర్శకుడు ట్విస్ట్ రూపంలో చూపిస్తాడు. మెజీషియన్ పాత్ర కూడా ఇందులో  కనిపిస్తుంది. కొన్ని ప్రధాన మలయాళ చిత్రాలను చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్ షైజు ఖలీద్ రాత్రి పూట సన్నివేశాలు బాగా ఆవిష్కరించాడనే చెప్పాలి.
 
ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బ్లాక్ కామెడీ మిశ్రమాన్ని కలిపిస్తుంది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో మరణం, కొంతమంది అనుమానితులు. ఒక కల్లుగీత దుకాణం, గ్రామంలోని సాధారణ ప్రజలు తరచుగా వచ్చేవారు, వారిలో చాలా మందికి గతంలో చీకటి రికార్డు ఉంది. కల్లుగీత దుకాణం యజమాని చనిపోయినప్పుడు ఏమి జరిగిందనేది పలురకాలుగా చూపించడం బాగుంది. మెరిండా భర్తను రాత్రిపూట స్కూల్ బస్ ఛేజింగ్ సన్నివేశం, ఎస్.ఐ. ఇష్యూ జరిగినప్పుడు కనీసం ఫ్యాంట్ వేసుకోకుండా నిక్కర్ తోనే బైక్ పై వెల్లడం వంటివి రియలస్టిక్ గా వుండేాలా దర్శకుడు రాసుకున్నాడు. తెలివైన థ్రిల్లర్‌లో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ఆకట్టుకున్నారు. మలయాళ థ్రిల్లర్ ఫార్మెట్ లో కినిపించే  ప్రవింకూడు షప్పు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.
రేటింగ్ 2.5/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు