రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

దేవి

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (11:04 IST)
Rajani cooli
రజనీకాంత్‌ పాన్‌ వరల్డ్‌ సినిమా కూలీ సినిమాలో పాన్‌ ఇండియా నటీనటులు నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. సోమవారంనాడు రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేసాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున షూట్‌ లో ప్రవేశించినట్లు సమాచారం. అదేవిధంగా మిగిలిన సన్నివేశాల్లో వివిధ భాషల్లోని లెజండ్రీ నటులు నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 30 రేషియోలో  తెలుగు, తమిళ జూనియర్ నటీనటులు నటిస్తున్నారు.
 
ఇంకా ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ MGR సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్‌లలో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ 2025లోనే  ప్రపంచవ్యాప్తంగా  IMAX ఫార్మాట్‌లలో కూలీ  విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్ మరియు ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్, సంగీతం అనిరుధ్ రవిచందర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు