శ్రీరామ్ (రూపేష్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. చిన్నతనంలో తల్లి (అర్చన) మాట ప్రకారం నీతి, నిజాయితీ, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే టైపు. దానితో పలు సమస్యలు ఎదుర్కొంటాడు. తల్లిదండ్రులకు దూరంగా ఓ కాలనీలో వుంటాడు. అలాంటి టైంలో జానకి (ఆకాంక్ష సింగ్) ప్రవేశిస్తోంది. తొలి చూపులోనే అతను ప్రేమించేస్తాడు. జానకికి చెందిన ఓ స్థలం విషయంలో శ్రీరామ్ సమస్యను సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పిన శ్రీరామ్ ను నిజాయితీగా వుంటే పెళ్లాన్ని ఎలా పోషిస్తావ్? అనే లాజిక్ తో మార్చేస్తుంది. దాంతో పి.పి.గా రూటు మార్చి లక్షాధికారిగా మారిపోతాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ్ తల్లి నిలదీస్తుది. నువ్వూ నీ నాన్నలాగే అబద్దాలతో భార్యను మోసం చేశావ్.. అంటూ అడగడంతో షాక్ అవుతాడు. ఆ తర్వాత శ్రీరామ్ ఏం చేశాడు? అసలు షష్టిపూర్తికి సంబంధం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఇది తెలుగు కథ. చిన్న, మధ్య తరగతికి చెందిన సినిమా. ఆయా కుటుంబంలో వుండే సంబంధాలు ఇగోలు, చుట్టు పక్కల కుటుంబాల ప్రవర్తన అనేవి దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. షష్టి పూర్తి అనేది గత సినిమాల్లో ఓ సన్నివేశం మినహా టైటిల్ గా ఇంతవరకు సినిమా రాలేదనే చెప్పాలి. పిల్లలు చూసే తల్లి దండ్రులు పెండ్లి షష్టి పూర్తి మాత్రమే. మానవుడి ఆయుష్షు 120 సంవత్సరాలు. అందులో 60 రాగానే సగజీవితం పూర్తిచేస్తారనే గతంలో పెద్దలు పెట్టారు. అది కాలక్రమేణా రకరకాలుగా మారింది.
అయితే లోగడ ఏప్రిల్ 1 విడుదల అని అప్పట్లో పెద్ద వంశీ సినిమా తీసాడు..ఆ కథలో మేన్ పాయింట్.. హీరో ఎప్పుడూ అన్ని అబద్ధాలు చెప్పి తన కథని కోన సాగదీస్తుంటే... హీరోయిన్ ...ఇక నుండి అన్ని నిజాలు చెప్తే నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాను అనేసరికి ఇంటర్వెల్ పడుతుంది..
సేమ్ టు సేమ్ కానీ రివర్స్...హీరో అన్ని నిజాలు చెప్తుంటే...ఇక నుండి అబద్ధాలు చెప్తేనే నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాను అనేసరికి ఇంటర్వెల్ పడుతుంది... ఇంకో రెండు సిమిలారిటీస్ april 1 విడుదల చిత్రంలా...
1) హీరో అందులో ఉండేది ఓ రైల్వే కాలనీ (ఇది నిజమైనది) బ్యాక్ గ్రౌండ్లో, చుట్టుపక్కల కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి..
1) ఇందులో కూడా హీరో ఉండేది సేమ్ అలాంటి కాలనీ బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్ లాగా..
2) అందులో కూడా ఓ చిట్టీల ఏజెంటుగా Y.విజయ పాత్ర ఉంటే
3) ఇందులో కూడా ఓ చిట్టిలు వేసే ఏజెంట్ పాత్ర ఓ ముసలావిడ వేసింది...
వంశీ కథ నవిస్తూ, కవిస్తూ సాగితే..ఇది అదో టైపులో స్లోగా సా....గుతుంది యూట్యూబ్ లో వచ్చే టైటిల్స్ ఒకటి, లోపల ఉండే స్టోరీలు వేరే..అలాగే సినిమా టైటిల్ ఒకటి నడిచే సబ్జెక్ట్ ఇంకోటి. .క్లైమాక్స్ లో టైటిల్ జస్టిఫికేషన్ తో షష్టిపూర్తి.....పూర్తవుతుంది.
నటులపరంగా రాజేంద్రప్రసాద్ కొట్టిన పిండే. రెండుషేడ్స్ వున్నాయి. అర్చన కాంబినేషన్ లో లేడీస్ టైలర్ తర్వాత కలిసి చేశారు. మధ్య వయస్సులో వారి లవ్ ట్రాక్ ఒకరకంగా అనిపిస్తుంది. రూపేష్ కొత్తగా అయినా పాత్రను బాగా పోషించాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. ఆకాంక్ష సింగ్ అతనికి జోడీగా సరిపోయింది. కాలనీలో వుండే కుటుంబాల్లోల చలాకి చంటితోపాటు పలువురు కాస్త ఎంటర్ టైన్ చేస్తారు. అక్కడక్కడ కమర్షియల్ గా ఒకటి రెండు ఫైట్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ హృద్యంగా ఉన్నాయి.
సాంకేతికంగా ఇళయరాజా బాణీలు బాగున్నాయి. యువన్ శంకర్ రాజా అందించిన ఎరోటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. గోదావరి అందాలను కెమెరాలో బాగా చూపించాడు. తోట తరణి ఆర్ట్స్ వర్క్ బాగుంది. నిర్మాతగా కూడా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు.
కుటుంబకథా చిత్రాల పేరుతో చాలా వచ్చాయి. అయితే విడిపోవాలనుకున్న తల్లిదండ్రులను పిల్లలు ఎలా కలపారనేది ఆసక్తికరంగా వుంది. వివాహవ్యవస్థకు ఇప్పటి జనరేషన్ అర్థాలు మార్చేసింది. 60 సంవత్సరాల వయస్సులో విడాకులు కావాలని కోరుకునే వారు వుంటే ఎలా వుంటుంది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం. అక్కడక్కడా సినిమాటిక్ గా కొన్ని లోపాలున్నా, మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటల్లో సాహిత్యం బాగుంది. అయితే సినిమా ప్రమోషన్ లో మాత్రం కేవలం రాజేంద్రప్రసాద్, అర్చన ఫొటోలతో నమ్మించారు. కానీ ఈ సినిమా కథ చాలా పెద్దది. అన్ని అంశాలున్నాయి.
రేటింగ్ : 2.75/5