సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

దేవీ

బుధవారం, 28 మే 2025 (17:41 IST)
Vijay Antony, Leo John Paul, Ajay Dheeshan and team
మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని నటించిన కొత్త చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం.
 
ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్‌ను పెంచేసింది. ట్రైలర్‌ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసారు మేకర్లు.
 
‘మార్గన్’ ట్రైలర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన షాట్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్, అజయ్ ధీషన్ ప్రజెన్స్ మరింతగా అంచనాలు పెంచేస్తున్నాయి. ట్రైలర్ లాంచ్‌లో భాగంగా ‘మార్గన్’ టీం హైదరాబాద్‌కు విచ్చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..
 
విజయ్ ఆంటోని మాట్లాడుతూ,  నా సిస్టర్ జయ కొడుకు అజయ్‌ని ఈ చిత్రంతో లాంచ్ చేస్తున్నాను. ఇంతకు ముందు ‘బిచ్చగాడు 2’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. అజయ్ డెడికేషన్ చూసి ఈ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాను. రామ్ సర్ నాకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా ‘నకిలీ’ని తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేం ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. ఆయన నాకు ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ‘మార్గన్’ను రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ‘భద్రకాళి’ కూడా రానుంది. నా మూవీ తెలుగులో రిలీజ్ అవుతోందంటే మొత్తం బాధ్యతను భాష్య శ్రీ గారు చూసుకుంటారు. మా కాంబోలో ఇది 12వ చిత్రం. దీప్శిఖ రోల్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రిగిడా గొప్ప నటి. ‘మార్గన్’ చాలా గొప్పగా వచ్చింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. జూన్ 27న రాబోతోన్న ‘మార్గన్’ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
 
లియో జాన్ పాల్ మాట్లాడుతూ .. ‘దర్శకుడిగా ‘మార్గన్’ నాకు మొదటి చిత్రం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని సర్, రామాంజనేయులు సర్‌కు థాంక్స్. ఇంత వరకు నేను ఎడిటర్‌గా ఎన్నో చిత్రాలను చేశాను. కానీ విజయ్ ఆంటోని గారు మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలను చేశారు. ఆయన సహకారంతో నాకు ఈ సినిమా జర్నీ చాలా ఈజీగా మారిపోయింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ఈగ, మగధీర అంటే నాకు చాలా ఇష్టం. ‘మార్గన్’ కోసం చాలా ఖర్చు పెట్టాం. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంతో కష్టపడి తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కూడా విజయ్ ఆంటోని గారు ఏర్పాటు చేసిన సంస్థలోనే ఏకధాటిగా చేసేయొచ్చు.  భాష్య శ్రీ గారు మాకు మంచి డైలాగ్స్ మరియు పాటల్ని అందించారు. విజయ్ గారు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అజయ్ ఏడీగా చాలా చిత్రాలకు పని చేశారు. కానీ ఇందులో అద్భుతంగా నటించాడు. అండర్ వాటర్ సీక్వెన్స్‌ కోసం అజయ్ చాలా కష్టపడ్డాడు. దీప్శిఖ, బ్రిగిడ చక్కగా నటించారు.  జూన్ 27న మా ‘మార్గన్’ సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
రామాంజనేయులు మాట్లాడుతూ .. ‘విజయ్ ఆంటోని గారు నాకు పదిహేనేళ్లుగా తెలుసు. అప్పుడు మ్యూజిక్ చేస్తుండేవారు. హీరోగా ట్రై చేస్తానని నాకు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు హీరోగా ఎందుకు అని అడిగాను. కానీ ఆయన సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాను. మేం ఇద్దరం కలిసి చేసిన మొదటి సినిమా ‘నకిలీ’. ఇప్పుడు ‘మార్గన్’ మూవీని రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ‘భద్రకాళి’ సినిమా కూడా రానుంది. విజయ్ ఆంటోని అంటే మన పక్కింటి అబ్బాయి అనే మంచి ఫీలింగ్ ఉంటుంది. విజయ్ ఆంటోని తన మేనల్లుడు అజయ్‌కి లైన్ క్లియర్ చేస్తున్నారు. ఆల్రెడీ ‘బిచ్చగాడు’ డైరెక్టర్‌తో అజయ్ సినిమాను సెట్ చేశారు. విజయ్ ఎప్పుడూ కూడా మనీ గురించి ఆలోచించరు. అందరికీ సాయం చేస్తుంటారు. అలాంటి మంచి వ్యక్తికి మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేయాలి. జూన్ 27న రానున్న ‘మార్గన్’ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
అజయ్ ధీషన్ మాట్లాడుతూ .. ‘‘మార్గన్’నాకు మొదటి చిత్రం. విజయ్ ఆంటోనీ బ్యానర్‌లో పరిచయడం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన లియో సర్‌కు థాంక్స్. ఆయన చాలా గొప్ప క్రియేటర్. తమిళంలో గొప్ప ఎడిటర్. బ్రిగిడ చాలా టాలెంటెడ్ పర్సన్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించింది. దీప్శిఖ అద్భుతంగా నటించింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న రామ్ సరికి థాంక్స్. భాష్య శ్రీ గారు తెలుగులో మంచి డైలాగ్స్ రాశారు. మా సినిమా జూన్ 27న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
దీప్శిఖ మాట్లాడుతూ .. ‘ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. తెలుగులో ‘మార్గన్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు ఇక్కడ ఇలా నా బర్త్ డేను సెలెబ్రేట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన డైరెక్టర్ లియో జాన్ పాల్ గారికి థాంక్స్. ఎడిటర్‌గా తమిళంలో ఆయన చాలా ఫేమస్. ఇక ఇప్పుడు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా మూవీని తీశారు. విజయ్ ఆంటోని గారి సినిమాలెప్పుడూ కొత్తగానే ఉంటాయి. సామాజిక అవగాహన కల్పించేలా చిత్రాల్ని తీస్తుంటారు. యూనిక్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. విజయ్ ఆంటోని సినిమా అని చెప్పడంతోనే వెంటనే ఓకే చెప్పేశాను. అజయ్ అచ్చం తన మామ విజయ్ ఆంటోనీలానే ఉంటారు. ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ‘మార్గన్’ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
 
బ్రిగిడా మాట్లాడుతూ .. ‘నాకు ‘మార్గన్’ చాలా ప్రత్యేకం. ఈ ఏడాదిలో ఇదే నా మొదటి సినిమా. ఎంత ప్యాషన్ ఉన్నా కూడా సహనం కూడా ఉండాలని నేను నమ్ముతుంటాను. నేను అంత సహనంగా వెయిట్ చేశాను కాబట్టే నాకు ‘మార్గన్’ లాంటి చిత్రం వచ్చింది. విజయ్ సర్, లియో జాన్ పాల్ సర్ నాకు కాలేజ్‌లో సీనియర్. ‘మార్గన్’ గురించి ఎంతో చెప్పాలని ఉంది. కానీ ట్విస్ట్‌లు ఎక్కడ చెప్పేస్తానో అని భయంగా ఉంది. అజయ్ గారు ఇది మొదటి సినిమాలా నటించలేదు. మొదటి సారి పోలీస్ ఆఫీసర్‌ పాత్రను పోషించాను. దీప్శిఖ చాలా మంచి వ్యక్తి. ‘మార్గన్’ మూవీని జూన్ 27న అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘విజయ్ ఆంటోని గారు ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తుంటారు. మార్గన్ అంటే తెలుగులో మార్గం అని అర్థం. మరి ఈ మార్గం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూడాలి. అద్భుతమైన కాన్సెప్ట్‌తో చిత్రం రాబోతోంది. అజయ్ ధీషన్ మన తెలుగబ్బాయి. దీప్శిఖ, బ్రిగిడా అద్భుతంగా నటించారు. విజయ్ ఆంటోని గారు వేసుకున్న మేకప్ వెనుకున్న సీక్రెట్ ఏంటో జూన్ 27న చూడండి. తెలుగులోకి ఈ మూవీని రామాంజనేయులు తీసుకు రాబోతోన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశాను. ఈ సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చుతుండగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
 
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్
 
సాంకేతిక సిబ్బంది:

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు