నాకు అమ్మ, అక్క ఉన్నారు. షాప్ కు వెళితే నేను వెంటనే కావాల్సింది కోనేస్తాను. కాని అమ్మ, అక్క కొనరు.. మూడు షాప్స్ తిరిగి మల్లి మొదటికే వస్తారు. నేను లేడీ గెటప్ కోసం వేసిన తర్వాత వారి బాధలు అర్ధం అయింది అని విశ్వక్ సేన్ అన్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ లైలా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడారు.