మాస్ కా దాస్ విశ్వక్సేన్ తాజాగా లైలా అనే సినిమాలో నటిస్తున్నారు. ఆకాంక్ష శర్మ నాయిక, రామ్ నారాయణ్ దర్శకుడు సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్ తో ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ సేన్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. సోను మోడల్ పాత్రతోపాటు హీరో పాత్ర పోషిస్తున్నారు.