ఈ సందర్భంగా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయ్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, సింగం 123, వైరస్ తరువాత నేను చేస్తున్న 5 వ సినిమా బజార్ రౌడీ . సంపూర్ణేష్ గా హృదయ కాలేయం సినిమా ద్వారా రాజేష్ గారు నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే బజార్ రౌడీ చిత్రం ఒక ఎత్తు. ఈ సినిమా నా జర్నీ కి మరో మెట్టు అవుతుంది.. ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా కాస్తా అలస్యమైంది. ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ లతో నటించడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నాను. కెమెరా మెన్ శ్రీనివాస్ గారికి ఆయన కెరియర్ లో నా సినిమానే చిన్న సినిమా అయ్యి ఉంటుంది.ఈ సినిమా ఇంతదూరం రావడానికి నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు.నాకింత మంచి అవకాశం. కల్పించిన మా నిర్మాతకు వేదిక మీదే పాదాభివందనం చేస్తున్నాను.గత చిత్రాల మాదిరే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరోయిన్ మహేశ్వరి మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.నేను హీరోయిన్ గా ఇంతదూరం రావడానికి కారణమైన నా తల్లితండ్రులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు సినిమా ఇన్ని థియేటర్స్ లలో విడుదల అవుతుంది అంటే కేవలం ప్రొడ్యూసర్ ఫ్యాషన్ మాత్రమే .నిర్మాత వయసులో ఎంతో పెద్ద వారైనా ప్యాసినెట్ తో 24 క్రాఫ్ట్స్ దగ్గరుండి చూసుకున్నారు అన్నారు.
.
చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ .చిత్ర యూనిట్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా పని చేశారు. నిర్మాత వ్యవసాయదారుడైనా కూడా సినిమా పై ఉన్న ఫ్యాషన్ తో సినిమా బాగా రావాలని దగ్గరుండి అన్ని విభాగాలను హ్యాండిల్ చేస్తూ ఖర్చుకు వెనుకడకుండా చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. సంపూర్ణేష్ బాబు ను హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, ల కాకుండా నేను మరో యాంగిల్ లో చూపించాను. ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది అన్నారు.