అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం పాటలు రాయడానికి సినిమాని చూడటం జరిగింది. సినిమా చూసిన తర్వాత దీనికి పాటలు రాయడం కంటే ఇంత మంచి సినిమాని ఆడియన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎలా రిలీజ్ చేయాలనే ఆలోచన ఎక్కువైంది. మంచి సాహిత్యం రాసే అవకాశం దొరికింది. ఈ సినిమాలో నటించిన నటీనటులంతా చాలా సహజంగా పాత్రలలో ఒదిగిపోయారు. అసలు నటిస్తున్నారనే భావనే కలగలేదు. అంతా సహజ సిద్ధంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతుంది. నటనపరంగా మరో స్థాయిలో ఉండబోతుందని నమ్మకం నాకు ఉంది. మల్లేశం సినిమా ప్రియదర్శి గారికి ఎలా నటుడిగా జన్మనిచ్చిందో ఈ సినిమా కూడా ఇందులో నటించిన నటీనటులందరికీ కొత్త జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు'అన్నారు
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం ఇదే వేదిక మీద మల్లేశం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఈ వేడుకకు నన్ను ఇన్వైట్ చేసిన రాజ్ గారికి థాంక్యూ. నా కెరీర్ కి కొత్త ఊపిరినిచ్చిన వ్యక్తి రాజ్ గారు. ఆ కృతజ్ఞతతో ఈ వేడుకకి రావడం జరిగింది. నాకు మల్లేశం లాంటి మంచి సినిమానిచ్చిన రాజ్ గారికి ఈ వేదిక మీద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. '23' సినిమా కథ నాకు తెలుసు. ఈ కథని చేయమని రాజ్ గారు నా దగ్గరికి వచ్చారు. కొన్ని వేరే ప్రాజెక్ట్స్ వల్ల నేను చేయడం కుదరలేదు. చాలా గొప్ప సినిమా ఇది. ఇలాంటి గొప్ప ఆలోచన, కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న రాజ్ గారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. చరిత్రలో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా అవసరం. రాజుగారు లాంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండడం తెలుగు సినిమా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను చేసుంటే బాగుండేదని చిన్నఈర్ష్య కలిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ సినిమాని తప్పకుండా ఆడియన్స్ చూడాలి. తెలుగు సినిమా పాటకి కొత్త గౌరవం తీసుకొచ్చిన చంద్రబోస్ గారు ఈ వేదికపై ఉండడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబోస్ గారి లాంటి గొప్ప రచయిత ఈ సినిమాకి పని చయడం చేయడం చాలా గర్వంగా ఉంది. తేజ, తన్మై తో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ అభినందనలు. ఇలాంటి సినిమాలు తీసే బాధ్యత నటులుగా ఫిలిం మేకర్స్ గా మాపై ఎంత ఉందో ఇలాంటి మంచి సినిమాల్ని విజయవంతంగా ముందుకు నడిపించే బాధ్యత ప్రేక్షకులు పై కూడా ఉంది. మే 16 వ తారీఖున ఈ సినిమా తప్పకుండా థియేటర్స్ లో చూడండి. థాంక్ యూ' అన్నారు.
డైరెక్టర్ రాజ్ రాచకొండ మాట్లాడుతూ, మార్క్ మ్యూజిక్ చేశారు. చంద్రబోస్ గారు, ఇండస్, రెహమాన్ లాంటి రచయితలు సినిమాకి పాటలు రాశారు. కార్తీక్, చిన్మయి, రమ్య బెహరా, కైలాష్ ఖేర్ లాంటి ప్రముఖ సింగర్స్ పాటలు పాడారు. చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా. థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా ఫోకస్ తో చేసిన సినిమా ఇది. ఇది థియేటర్ కి పర్ఫెక్ట్ సినిమా. దయచేసి ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. అక్కడ చూస్తే ఓటిటిలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో ఆడితే థియేటర్స్ కల్చర్ బావుంటుంది. ఇక్కడ పని చేసిన అందరూ కూడా ఫ్యూచర్లో పెద్ద సినిమాలకి వర్క్ చేస్తారు. ఇలాంటి సినిమాలుని ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేశాను. కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ తో చేసిన సినిమా కాదిది. ఇలాంటి సినిమాలను మీడియా కూడా కాస్త ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అందరి సహకారం ఉండాలని కోరుతున్నాను'అన్నారు.
తన్మై మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా తొలి సినిమాకే చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం గొప్ప ఆనందాన్నిచ్చింది. ఇందులో ప్రతి పాట మా జర్నీని తెలియజేస్తుంది. అంత బ్యూటిఫుల్ గా లిరిక్స్ రాసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ గారికి థాంక్యూ సో మచ్. ఒకడెబ్యు ఆర్టిస్ట్ కి ఫుల్ లెన్త్ రోల్ దొరకడం అదృష్టం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడాలి. మే 16న అందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను'అన్నారు.